Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వికారాబాద్ జిల్లా తాండూర్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడిన బందెప్పకు తమకు ఎలాంటి సంబంధం లేదని తపస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఈ లీకేజీలో తపస్ సభ్యులున్నారంటూ చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నిందారోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. తాము ఎలాంటి రాజకీయ పార్టీలకు అనుబంధంగా లేమని పేర్కొన్నారు.