Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ టిప్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త మైలారం జంగయ్య, కోకన్వీనర్లు లక్ష్మయ్య, మంజునాయక్, బాక్యానాయక్, గోపాల్ నాయక్, శోభన్‌బాబు, మనోహర్, రహీం లేఖ రాశారు. ఇంటర్ విద్యలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, లైబ్రరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు, కాంట్రాక్టు అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి బదిలీలు చేయాలని కోరారు. పదేండ్లకుపైగా బదిలీలు లేకపోవడంతో కుటుంబాలకు దూరంగా ఉద్యోగులుంటున్నారని, తీవ్ర మానసిక, ఆర్థిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తక్షణమే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఇంటర్ ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.