Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బాబూ జగ్జీవన్రాం జయంతిని బుధవారం ఎన్టీఆర్భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ , ఇతర నాయకులు నివాళులు అర్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన్పటి నుంచి నేటివరకు మనం ఊపిరి పీల్చుకోవడానికి ఇద్దరు మహానుభావులు కారణమని చెప్పారు. వారే డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రాం అని అన్నారు. అంటరానితనం బాధలను వారు స్వయంగా అనుభవించారని గుర్తు చేశారు. స్వాతంత్య్రాన్ని ఎందుకు తీసుకొచ్చారో మనమందరం ఆలోచించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు వాళ్ల వాళ్ళ కాళ్లమీద నిలబడాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలను చేశారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఈ మహానుభావులు కల్పించిన బిక్షేనని చెప్పారు. వీరి స్ఫూర్తితోనే పేద, బడుగు వర్గాలకు న్యాయం చేయాలని ఎన్టీ రామారావు పెద్ద ఎత్తున కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. అలాంటి మహానుభావులను తలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి తరానికి అలాంటి మహనీయుల గురించి తెలియజెప్పాల్సి ఉందని అన్నారు. జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్న్ప టీడీపీ రాష్ట్ర నాయకులు పొలంపల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, అజ్మీర రాజునాయక్, షేక్ ఆరీఫ్, రాష్ట్ర మీడియా కో ఆర్టినేటర్ బియ్యని సురేష్, వెజండ్ల కిషోర్, సాయితులసీ, రాఘవులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.