Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజరుకుమార్ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారనీ, ఎక్కడున్నా పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులివ్వాలని ఆ పార్టీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం కోర్టుకు సెలవు కావడంతో జడ్జి ఇంటి వద్ద పిటిషన్ విచారణ చేయాలని కోరారు. గురువారం విచారణకు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ఆదేశాలిచ్చారు. మంగళవారం రాత్రి కరీంనగర్లో ఇంటికి వచ్చిన పోలీసులు ఏకపక్షంగా బండిని అదుపులోకి తీసుకుని వాహనాలు మార్చుతూ వేర్వేరు చోట్లకు తీసుకువెళ్లారనీ, మందులు కూడా వేసుకోనీయలేదనీ, వెంటనే కోర్టులో హాజరుపర్చేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ హౌస్‌మోషన్ పిటిషన్లో హైకోర్టును కోరారు.