Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి, టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ క్రీడగా మారి లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమైపోయిందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లీకేజీలకు ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఎవరో నిగ్గు తేల్చడానికి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పక్కదారి పట్టి రాజకీయ క్రీడ, పోలీసు క్రిమినల్ కేసులు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరాటం మారడం శోచనీయమని తెలిపారు. బండి సంజరు రాజకీయ అవకాశవాదం, ఈ లీకేజీల వ్యవహారాన్ని రక్తికట్టించిందని పేర్కొన్నారు. ఈ లీకేజీలకు మూలమెవరో కనిపెట్టాలని డిమాండ్ చేశారు. దీనివెనుక ఎంతటివారున్నా కఠినంగా శిక్షించాలని కోరారు.