Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ హాస్టళ్ల సమస్యల సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల మెస్చార్జీల పెంపుదల కాగితాలకే పరిమితమైందని సంక్షేమ హాస్టళ్ల సమస్యల సాధన సమితి (ఎస్హెచ్ఎస్ఎస్ఎస్) విమర్శించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి వెంటనే ఉత్తర్వులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఆ సంఘం నాయకులు జాడి విలాష్, కుల నిర్మూలన వేదిక నేత కోట ఆనంద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికల్లో ప్రకటనలు వచ్చి నెలరోజులు గడిచినా ఇంత వరకు ఉత్తర్వులు విడుదల కాలేదని తెలిపారు. దళిత, బహుజన విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
పోస్ట్ మెట్రిక్ కాలేజీ విద్యార్థుల మెస్ చార్జీలు రూ.3,500, ప్రీమెట్రిక్ విద్యార్థుల మెస్చార్జీలను రూ.మూడు వేలకు పెంచి తక్షణమే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి నెలకు రూ.వెయ్యి స్టైఫండ్ మంజూరు చేయాలని కోరారు.