Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టు అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారంపై ఢిల్లీలోని ఆపార్టీ అధిష్టానం ఆరా తీసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కేసుపై మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
అరెస్టును ఆపార్టీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, సీహెచ్ విఠల్, ఎస్ కుమార్, ఎన్వీ సుభాష్, రాణిరుద్రమదేవి, జె సంగప్ప, పోరెడ్డి కిశోర్‌రెడ్డి తదితరులు తీవ్రంగా ఖండించారు. ఈనెల 8వ తేదీ ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటన ఉన్నదనీ, దానిలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగసభ ఉన్నదని చెప్పారు. అది జరిగితే తమ ఉనికికే ప్రమాదమని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
మరోవైపు బండి సంజయ్ కు కలిసేందుకు బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయనకూ, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వివాదం, పెనుగులాట జరిగాయి. మరోవైపు ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి హైకోర్టులో బండి సంజరుపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బుధవారం కోర్టుకు సెలవు గురువారం దీనిపై విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈలోపే వరంగల్ పోలీసులు ఆయన్ని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచిన విషయం తెలిసిందే.