Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే వున్నాయి. బుధవారం హైదరాబాద్లో మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన కీలక నేత పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన దిలీప్ గోరె, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి అధినేత ఆహ్వానించారు. దిలీప్ గోరే..బీడ్ మున్సిపల్ మేయర్గా గతంలో పనిచేశారు. ప్రస్థుతం శివసేన పార్టీ బీడ్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. వీరికి ఆ ప్రాంతంలో రాజకీయంగా గట్టి పట్టుంది.
ఆయనతో పాటు...మహారాష్ట్ర చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విద్యాధికుడు శివరాజ్ జనార్థన్ రావు భంగర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.