Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్ 1 లీకేజీ బాధితులకు నియామకం పూర్తయ్యే వరకు తమ కేంద్ర కార్యాలయంలో ఉచిత భోజన వసతి కల్పించనున్నట్టు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ తెలిపారు. ఈ మేరకు బుధవా రం ఒక ప్రకటన విడుదల చేశారు.30 లక్షల మంది నిరుద్యోగులను ఆదుకు నేందుకు చేతులు రాని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్ధమైందని విమర్శించారు. వంద మంది ఉద్యోగార్థులకు సామాజిక బాధ్యతగా ఉచిత భోజన వితరణ చేయనున్నట్టు వివరించారు.