Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ జరుపుతున్నాం
- పోస్టల్‌శాఖ వివరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పదవతరగతి జవాబుపత్రాలను వాల్యుయేషన్ సెంటర్‌కు తరలిస్తుండగా, ఒక పార్సిల్బ్యాగ్ మిస్ అయ్యిందనీ, దీనిపై శాఖాపరమైన విచారణ
జరుపుతున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ (బీడీ అండ్ మెయిల్స్) ఎన్ఎస్ఎస్ రామకృష్ణ తెలిపారు. మూడు దశాబ్దాలుగా తమ శాఖ ఈ బాధ్యతలను అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్నదనీ, తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఈనెల 3వ తేదీ గుర్తించినట్టు తెలిపారు. ఉట్నూరు సబ్‌పోస్టాఫీసు నుంచి ఉట్నూరు బస్టాండ్‌కు జవాబుపత్రాలు రవాణా చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు గుర్తించామన్నారు. అంతర్గత విచారణ జరుగుతున్నదనీ, అదే సమయంలో టెన్త్ జవాబుపత్రాల రవాణాపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.