Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతడిని అనర్హుడిగా పార్లమెంట్ ప్రకటించాలి
- పచ్చగా ఉన్న తెలంగాణలో అగ్గి రాజేయాలని బీజేపీ యత్నం
- విద్యార్ధుల జీవితాలతో
- చెలగాటమాడితే మట్టి కొట్టుకుపోతారు : తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థుల జీవితాలతో చెలగాటమడుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పార్లమెంట్ స్పీకర్, సెక్రెటరీలకు లేఖ రాశారు. తెలంగాణలో విద్యార్ధులు, నిరుద్యోగుల్లో అయో మయం పెంచేందుకే బీజేపీ పేపర్ లీకేజీలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి పాల్పడిన బూర ప్రశాంత్‌తో బండి సంజయ్ గంటల కొద్ది ఫోన్లు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. కావాలనే పదవ తరగతి పరీక్షలు రాస్తున్న 4.8 లక్షల మంది విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను అయోమయానికి గురి చేయడానికే బండి సంజయ్ కుట్ర పన్నారని విమర్శించారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఆప్తమిత్రుడు అదానీ గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన పార్లమెంట్, దాదాపు 4.8 లక్షల మంది పదవ తరగతి విద్యార్ధుల ప్రాణాలతో వారి ఉజ్వల భవిష్యత్‌తో చెలగామడుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజరు కుమార్ పార్లమెంట్ సభ్యత్వంపై సైతం అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.