Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు పన్నులు పెంచాలి
- పేదల సంక్షేమ కార్యక్రమాలను పెంచాలి : ప్రజా, కార్మిక, కర్షక, కూలీల డిమాండ్లకు ఉద్యోగుల సంఘీభావం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలోని అత్యంత సంపన్నులపై సంపద పన్ను విధించాలని, కార్పొరేట్లకు పన్ను పెంచి, పేదల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్, నేషనల్ వైస్ చైర్మెన్ వి.కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ప్రజలపై భారాలు మోపుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం ఢిల్లీలో లక్షలాది శ్రమజీవులు నిర్వహించిన మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ ర్యాలీలో ప్రకటించిన డిమాండ్లకు పలు ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్పొరేటీకరణ విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు, సింగరేణి, విశాఖఉక్కు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, పెట్రోలియం, రైల్వే, డిఫెన్స్, ఇన్సూరెన్స్, ప్రభుత్వరంగ బ్యాంకులు, హైవేలు మొదలైన ప్రజల సంపదకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు.