Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఎస్పీఎస్సీకు వెంటనే కొత్త చైర్మెన్, సభ్యులను నియమించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల వ్యవహారం ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనమన్నారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పేపర్ లీకేజీపై సిట్ విచారణ కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకుల విషయంలో ప్రశాంత్, బండి సంజరుతో వందల సార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.