Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి వైఎస్ షర్మిల సూటి ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'కేంద్రంలోని బీజేపీ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రకటించి నిరుద్యోగులను మోసం చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది ఉద్యోగాలు ఇచ్చి ఉంటే కనీసం 10 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. బీఆర్ఎస్, బీజేపీ దొందు దొందే?' అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగమని ఉద్యమంలో చెప్పి కేసీఆర్ మోసం చేశారని అన్నారు. పేపర్ లీక్‌తో నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని, సీబీఐ విచారణ అంటే కేసీఅర్ ఎందుకు భయపడుతున్నారని విమర్శించారు.
నిరుద్యోగుల పక్షాన కొట్లాడింది కేవలం వైఎస్ఆర్టీపీనేననీ, పార్టీ పెట్టక ముందే తాను 72 గంటలు దీక్ష చేశానని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలపై ఈ నెల 7న రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలనీ, 8న రిలే దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 9న దిష్టి బొమ్మలు దగ్దం చేయాలని, 10న హైదరాబాద్‌లో టీ-సేవ్ ఫోరం సమావేశం ఏర్పాటు చేయాలనీ కోరారు. 12న కాగడాల ప్రదర్శన చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.