Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి, అమర్యాదకరమైనవని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా న్యాయానికి లోబడి ప్రజారక్షణకు నిర్విరామంగా కృషి చేస్తున్న రాష్ట్ర డీజీపీని బీహారీ గుండాగా కించపరుస్తూ రఘునందన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవని ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారుల సంఘం జాయింట్ సెక్రెటరీ బి. సుమతి అన్నారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను కాపాడుతున్న పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయని ఆమె అన్నారు. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులను పాటించరాదంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పూర్తి అప్రజాస్వామికమైనవని, ఒక బాధ్యతాయుతమైన శాసన సభ్యుడు అనాల్సిన మాటలు కావని ఆమె చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రఘునందన్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు.
రఘునందన్ వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి
రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం
'బీహారీ గుండా అంజనీకుమార్' అంటూ రాష్ట్ర డీజీపీపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవనీ, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిన రాష్ట్ర పోలీసుల అధిపతిని ఇలాంటి దౌర్భాగ్యపు మాటలతో కించపర్చడం ఎమ్మెల్యేకు సరికాదని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రఘునందన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.