Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాజకీయ కుట్ర చేసిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. లీకేజీ ద్వారా రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సిగ్గుచేటని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీని విద్యార్థులు, తల్లిదండ్రులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.