Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ప్రశ్నాపత్రాల బయటకు రావడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉండడం ఆందోళనకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. లీకేజీ వ్యవహారంలో బండి సంజరుకి ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన నిరూపించుకోవాల్సిన అవసరముందని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లీకేజీతో బీజేపీకి సంబంధముందంటూ మీడియాలో వస్తున్న వార్తలకు ఆయనే బాధ్యత వహించాలని కోరారు. ఈ అంశాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడి రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించే ఎంతటివారినైనా కఠినంగా శిక్షించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
జగ్జీవన్‌రామ్‌కు సీపీఐ నివాళి
బాబు జగ్జీవన్‌రామ్ 115వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ జాతీయ కార్యదర్శి బినరువిశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.