Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణకు ఒప్పుకోని సుప్రీంకోర్టు ధర్మాసనం
- ఉపసంహరించుకున్న విపక్షాలు
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ప్రతిపక్షాలు పిటిషన్ను ఉపసంహరించుకున్నాయి. ప్రతిపక్షాల తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే 2014 నుంచి 2022 వరకు సీబీఐ, ఈడీ కేసులు అత్యధిక స్థాయిలో 600 శాతం పెరిగాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు 121 మంది రాజకీయ నేతలను ఈడీ విచారించగా అందులో 95 శాతం మంది ప్రతిపక్ష పార్టీలకు చెందినవారేనని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్పై అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్న సుప్రీం ధర్మానం స్పందించింది. '' దర్యాప్తు సంస్థల విచారణ ఉండకూడదని చెప్పగలమా..? నాయకులను దూరంగా ఉంచగలరా? రాజకీయ నాయకుడు ప్రాథమిక పౌరుడు. పౌరులుగా మనమంతా ఒకే చట్టానికి లోబడి ఉంటాం'' అని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సింఘ్వీ స్పందిస్తూ.. భారతదేశంలో పెండింగ్లో ఉన్న ఏ కేసును సైతం ఈ పిటిషన్ ప్రభావితం చేయకూడదనీ, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని కూడా కోరడం లేదని ఆయన అన్నారు. ఇక ఈ పిటిషన్ను ప్రస్తావిస్తూ.. కోర్టు సామాన్యులకు, రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించలేదని సీజేఐ డివై చంద్రచూడ్ నేతత్వంలోని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. పిటిషన్ను డిస్మిస్ చేసింది. అయితే పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు సింఘ్వీ కోర్టును కోరగా.. దానికి అనుమతినిచ్చింది.