Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎమ్)గా కే రవీన్కుమార్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సికింద్రాబాద్ రైల్నిలయం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన్ని పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ పోస్టులో ఆయన నియమితులు కాకముందు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. 1988 ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్)కు చెందిన ఆయన రైల్వేశాఖలో పలు జోన్లలో వివిధ హౌదాల్లో పనిచేశారు.