Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మెదక్ టౌన్
టీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక బీజేపీ విద్యార్థులతో క్షుద్ర రాజకీయం చేస్తోందని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశంతో కలిసి మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం బహిర్గతం కేసులో.. అరెస్టయిన బండి సంజరు.. భవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఇంత నిసిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ, రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. బండి సంజరు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని, బీజేపీకి చదువు విలువ తెలియదన్నారు. విద్యార్థులు బీజేపీ కుట్రలను గమనించాలని పిలుపునిచ్చారు. తాండూరులో లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారని, వరంగల్‌లో అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారని తెలిపారు. ప్రశాంత్‌కు బీజేపీ అగ్ర నేతలతో సంబంధాలు ఉన్నాయని ఫొటోలు ప్రదర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు, టీఎస్పీఎస్సీ లీకేజీలో, ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ కుట్రలు రెడ్ హ్యాండెడ్‌గా బయటపడ్డాయనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు.