Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గురుకుల విద్యాలయాల సంస్థల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేయడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. 12 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టీఆర్టీకి నోటిఫికేషన్ కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని గురుకుల పరీక్షలకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఇవ్వాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న మూడు వేల గురుకుల పోస్టులకు కూడా త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఈ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.