Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ సివిల్ సర్వీసెస్ డే (ఏప్రిల్ 21)ని పురస్కరించుకుని సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఈనెల 20వ తేదీన ఆన్లైన్ ద్వారా ప్రతిభా పాటవ పరీక్షను నిర్వహిస్తున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ పి క్రిష్ణప్రదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యం ఉండి ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులను ప్రోత్సహించేందుకే ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సివిల్ సర్వీసెస్ అధికారులను దేశానికి అందించాలనే లక్ష్యంతోనే జరుపుతున్నామని తెలిపారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఈనెల 23న భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతులమీదుగా అవార్డులను ప్రదానం జరుగుతుందని వివరించారు.