Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 వరకు నిర్వహించాలని నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు కోసం వారు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కేంద్రాల వద్ద గురువారం నుంచి మౌన ఆవేదన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 11వ తేదీ వరకు దీన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్జీసీసీఎల్ఏ-475) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు లెక్చరర్స్/ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయబోతున్నట్లు ప్రభుత్వ ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ ఒకటో తేదీ దాటినా ఇంతవరకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు రాకపోవడంతో కాంట్రాక్టు అధ్యాపకులు/ ఉద్యోగుల కుటుంబాల తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతూ మూల్యాంకనం కేంద్రాల వద్ద భోజన విరామ సమయంలో మౌన ఆవేదన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సీఎం తక్షణమే జోక్యం చేసుకుని ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్రమబద్ధీకరణ ప్రక్రటియ జరిగేటట్టు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.