Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర రైల్వే మంత్రికి ఉత్తమ్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నల్గొండ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులను ఆధునీకరించాలని ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. నల్గొండ నియోజకవర్గంలో రవాణా, రైల్వే అనుసంధాన్ని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్ల్లీలో కేంద్ర మంత్రి అశ్వనీకుమార్‌కు ఆయన ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. డోర్నకల్-మిర్యాలగూడ మధ్య కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జగ్గయ్యపేట, మెళ్లచెరువు, జానపాడు, వాడపల్లి, విష్ణుపురం మధ్య 90 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం త్వరగా ప్రారంభించాలని పేర్కొన్నారు. ప్యాసింజర్ ట్రావెల్, సర్వీసులను ఇదే మార్గంలో ప్రారంభించాలనీ, సిమెంట్ ఫ్యాక్టరీలను ఈ లైన్ కలుపుతుందని వివరించారు. ఈ ప్రాంతాల్లో డబ్లింగ్ పనులను చేపట్టాలనీ, వందేభారత్ రైళ్లను నల్గొండ స్టేషన్లో ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ వెల్లడించారు. మిర్యాలగూడ స్టేషన్లో పలు రైళ్లను ఆపే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్‌కు లేదు
మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించడాన్ని సీఎం ఎప్పుడో మరచిపోయారని ఎద్దేవా చేశారు.ఆయన ఏనాడూ అంబేద్కర్‌ను గౌరవించలేదన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ ఎస్సీవిభాగం చైర్మెన్ ప్రీతంతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్న్తామన్నారు. అయితే రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదని వాపోయారు. ఎంతో మంది దళితులపై దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు.
సిలబస్‌ను మార్చవచ్చు.. కానీ చరిత్రను మార్చలేరు నిరంజన్
పాఠ్యాంశాల్లో సిలబస్‌ను మార్చవచ్చు కానీ చరిత్రను మార్చలేరని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ హెచ్చరించారు. 11,12 తరగతుల్లో గాంధీజీ పాఠాలను ఎన్సీఈఆర్టీ తొలగించడం సరైందికాదన్నారు. విద్యార్థులకు అన్ని విషయాలు, వాస్తవాలు ఇంటర్నెట్లో ఉన్నాయని చెప్పారు. సిలబస్‌లో ఆదానీ వ్యవహారంపై హిడెన్ బర్గ్ వెల్లడించిన పత్రాలు చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో వలస కార్మికులు పడిన ఇబ్బందులను కూడా చేర్చాలన్నారు. రాజకీయ సంకుచిత్వత్వంతో కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని కాంగ్రెస్ నేత కోరారు.