Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాచార పౌర సంబంధాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో మహిళా జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరంలో గురువారం వరకు 267 మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే మాస్టర్ హెల్త్ చెకప్‌లో రక్త పరీక్ష (సీబీపీ), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బీ12, డీ3 ,ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు చేస్తున్నారు. అదే రోజు పరీక్షల నివేదికలను అందచేస్తున్నారు. వైద్య అధికారులు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఈ విధానం పట్ల పరీక్షలు చేయించుకున్న మహిళా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.