Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 99.62 శాతం మంది విద్యార్థుల హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పరీక్షల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఇంగ్లీష్ (థర్డ్ లాంగ్వేజ్) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొదటిరోజు తెలుగు, రెండోరోజు హిందీ ప్రశ్నాపత్రాలు వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మిగిలిన పరీక్షలు ఎలా జరుగుతాయోనని విద్యాశాఖ అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే గురువారం ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ పరీక్షకు 4,85,704 మంది దరఖాస్తు చేసుకుంటే, 4,83,856 (99.62 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. 1,838 (0.38 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రయివేటు విద్యార్థుల్లో 1,003 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 441 (43.97 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 562 (56.03 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.