Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కమిషనర్‌కు డి.ప్రభాకర్ రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమ్మె నోటీస్ ఇచ్చిన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (టీఎస్పీఈజేఏసీ) ప్రతినిధులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆప్ తెలంగాణ లిమిటెడ్ సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం లేబర్ కమిషనర్ కు లేఖ రాశారు. అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం, 1971 ప్రకారం సమ్మె నిషేధించబడిందని గుర్తుచేశారు. ఇది వరకే ఐదు దఫాలు వారితో చర్చించామనీ, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు దఫాలుగా ఇచ్చిన ఫిట్మెంట్ ఇతర బెనిఫిట్స్ విషయంలో వారు ప్రశంసించారని తెలిపారు. విద్యుత్ కంపెనీల ఆర్థిక పరిస్థితిని గమనంలో ఉంచుకుంటూనే వారి సమస్యల పరిష్కారం, డిమాండ్లను నెరవేర్చేందుకు సంయుక్త సమావేశంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.