Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విభజన హామీల్లో ఉన్న విద్యారంగానికి సంబంధించిన వాటి అమలు ఇంకెప్పుడు అంటూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణకు ఉన్నత విద్యాసంస్థలను కేటాయించని మోడీకి హైదరాబాద్ వచ్చే హక్కు లేదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంస్థలను కేటాయించకుండా తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాను నిలదీయడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు.