Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లర్ల దోపిడీని అరికట్టాలి: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే సమయం ఆసన్నమవుతుందనీ, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. తద్వారా మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరింది. గురువారం ఈమేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ ఒక ప్రకటన విడుదల చేశారు. మద్దతు ధరల కంటే తక్కువ ధరలకు మిల్లర్లు సిండికేటుగా ఏర్పడి రైతులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వడగండ్ల వానల వల్ల చేతికొచ్చిన పంటను దెబ్బతీంటున్నాయని తెలిపారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించిన సర్వే వివరాలను ప్రకటించాలని కోరారు. 33 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం అంటూ వ్యవసాయ అధికారులు మాట్లాడటం సరైందికాదని హెచ్చరించారు. ఏమేరకు పంట దెబ్బతిన్నా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.