Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రెండొ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. గురువారం ఈమేరకు జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గొర్రెల యూనిట్ల సేకరణ, రవాణా, లబ్ధిదారుల నుంచి డిపాజిట్లు సేకరణ తదితర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రెండో విడతలో 3.38 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. రవాణా సంబంధిత టెండర్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లాల ప్రజలు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.