Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌పై పీడీ యాక్టు కేసు నమోదు చేయాలని బీఎస్పీ అద్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. పదో తరగతి పేపర్ లీకేజీల వ్యవహారంలో బండి సంజయ్ పాత్రను వరంగల్ పోలీసులు బైటపెట్టారని తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం,రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి, అధికారంలోకి రావాలని చేసిన కుట్రను, పోలీసులు చేధించడం హర్షణీయమన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి కుట్ర జరగకుండా విచారణ చేపట్టి, అసలైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పేపర్ లీకైనట్లు నమ్మించేందుకు కుట్ర చేసిన బీజేపీ, రాష్ట్రంలో కాంతి వేగంతో అబద్దాలు,తప్పుడు సమాచారాన్ని సృష్టించి,ప్రచారం చేసిందన్నారు. రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించే కుట్ర చేసిందని విమర్శించారు.