Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్శనానికి వచ్చిన వారిలో ఇద్దరి మృతి
- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు..
నవ తెలంగాణ - అచ్చంపేట రూరల్
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలొని అమ్రామాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అడవుల్లో కొనసాగుతున్న సలేశ్వరం జాతరలో విషాద ఘటన జరిగింది. రెండ్రోజుల నుంచి జరుగుతున్న ఈ జాతరకు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. గంటల తరబడి లింగమయ్య దర్శనం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు తగినట్టు ఏర్పాట్లు లేకపోవడంతో ఊపిరాడక.. సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండో రోజు రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లా ప్రాంతానికి చెందిన చంద్రయ్యతో పాటు మరొకరు ఊపిరి ఆడక మృతిచెందాడు. మృతదేహాన్ని అతి కష్టం మీద కాడి పట్టుకుని పోలీసులు, అడవిశాఖ అధికారులు గురువారం ఉదయం 10 గంటల వరకు రాంపూర్పెంట వద్దకు చేర్చారు. అక్కడ నుంచి 108 అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మరొకరు కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది.