Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సంపేట గ్రేయిన్ మార్కెట్ గేట్ మూసి రైతుల ఆందోళన
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట వ్యవసాయ గ్రేయిన్ మార్కెట్లో మొక్కజొన్నపై వ్యాపారులు ఒకే సారి క్వింటాపై రూ.1971 ధరకు తగ్గించి పాటపాడి కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆగ్రహించారు. గురువారం రైతులు మార్కెట్ ప్రధాన ద్వారం గేటు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన మొక్కజొన్నలపై ట్రేడర్లు మద్దతు ధర రూ.1965పై వేలం పాట పాడారన్నారు. తిమ్మం పేట, లక్నెపెల్లి, రామవరం తదితర గ్రామాలకు చెందిన రైతులు అభ్యం తరం వ్యక్తం చేస్తూ నిన్నటి దాకా రూ.2023 పలికిన ధర ఏకంగా రూ.58లు తగ్గించి కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసమని నిల దీశారు. వడగండ్ల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, కొద్దోగొప్పో చేతికం దిన దిగుబడిని మార్కెట్కు తీసుకువస్తే వ్యాపారులు.. మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ అధి కారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. కాగా మద్దతు ధర రూ.1965 ఉండగా గురువారం అత్యధికంగా రూ.1971 ధర, గరిష్టంగా రూ.1980 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.