Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం 'ఆరోగ్య తెలంగాణ' గా అవతరించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కరువైన ఉమ్మడి పాలన నాటి గడ్డు పరిస్థితుల నుంచి నేడు తెలంగాణలో జిల్లాకో వైద్య విద్యా, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీలను స్థాపించుకునే దశకు చేరుకున్నామన్నారు. మెడికల్ కాలేజీల సీట్లు భారీగా పెంపు, ప్రభుత్వ దవాఖానాలు, మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టడం ద్వారా వైద్యం సామాన్యుడికి చేరువయిందని తెలిపారు. హైదరాబాద్ సహా వరంగల్ లాంటి ముఖ్యపట్టణాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్ళ(టిమ్స్) నిర్మాణం తో ప్రభుత్వ వైద్యసేవల్లో కార్పొరేట్ వైద్యం అందబోతున్నదని వివరించారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలోనూ అదనంగా పడకలు 2,500 పెంచామని వివరించారు. వరంగల్లోనూ అన్ని వైద్య సదుపాయాలు ఒకే చోట లభ్యమయ్యే విధంగా 'మెడికల్ హబ్' గా తీర్చిదిద్దుతున్నట్టు సీఎం తెలిపారు. కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉండడం స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతను చాటుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఆజాదీ కా అమత్ మహౌత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హెల్త్ ఫిట్నెస్ క్యాంపెయిన్లో మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్రం మూడింటిలోనూ అవార్డులు సాధించిందని తెలిపారు. నీటి ఆయోగ్ విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీల్లో మూడో స్థానాన్ని సాధించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.