Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో ఈదురు గాలులతో భారీ వర్షం
- పలుచోట్ల వడగండ్లు
- రోడ్లు జలమయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దిల్సుఖ్నగర్, ఉప్పల్, నల్లకుంట, అంబర్పేటతోపాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. పంజాగుట్ట ఏరియాలో భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆకాశం మేఘావృతం అయింది. అనంతరం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా మలక్పేట్, వీఎస్టీతోపాటు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు నగరంలో హనుమాన్ శోభాయాత్రలు జరుగుతుం డగా.. కొన్ని ప్రాంతాల్లో వానతో ఆటంకం కలిగింది. కాగా పలు జిల్లాల్లోనూ వడగండ్లు పడ్డాయి.
మూడ్రోజులపాటు వర్షం
రాష్ట్రంలో మరో మూడ్రోజులపాటు ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.