Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 నుంచి 30వరకు సాంస్కృతికోత్సవాలు
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామాజిక న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జన జాతరలు నిర్వహించనున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వృత్తిదారుల సంఘం సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ, తెలంగాణ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, మత్స్యకారులు, మత్య్స కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్బాబుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెస్లీ మాట్లాడారు. సామాజిక ఉద్యమ నేతల జయంతులను పురస్కరించుకుని 15నుంచి 30వరకు 15 రోజుల పాటు ఫూలే, అంబేద్కర్ జయంతుల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తం గా మనువాదుల కుట్రలను ఎండగడుతూ సాంస్కృతికో త్సవాలు, జన జాతరలు నిర్వహించాలని పిలుపునిచ్చా రు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని నెలకొల్పేందుకు బీజేపీ పాల కులు కుయుక్తులు పన్నుతున్నారని చెప్పారు. అందువల్ల రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింద న్నారు. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగాన్నంతా కారు చౌక గా కార్పొరేట్లకు అప్పగించి..రిజర్వేషన్లకు సమాధి కడు తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కుల గణన ఎందుకు చేపట్టటం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీ జనాభా దామాషా ప్రకారం వారికి నిధులు కేటాయించలేదని తెలిపారు. అదే సమ యంలో కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్ల రాయితీ లు ఇవ్వడమంటే మోడీ ప్రభుత్వం ఎవరి పక్షమో అర్థమవు తుందన్నారు. పేదలపై తీవ్రమైన భారాలు మోపుతూ..ఆ వైపుగా వాళ్లు ఆలోచించకుండా వైషమ్యాలను రగిలుస్తు న్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంవి రమణ మాట్లాడు తూ సామాజిక ఉద్యమ మహనీయులైన ఫూలే, అంబే ద్కర్ స్ఫూర్తితో బలహీన వర్గాల కోసం ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. బీజేపీ సర్కార్ చేస్తున్న మోసాలను జన జాతర సందర్భంగా ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాం గాన్ని తుంగలో తొక్కడం, రిజర్వేషన్లు ఎత్తేయడం ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగమన్నారు. బీజీపీ దాన్ని అమలు చేసేందుకు పూనుకుంటున్నదని చెప్పారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే గిరిజనులను అడవికి దూరం చేసే చట్టాలను తీసుకొస్తున్నదనీ, ఈ నేపథ్యంలో రాంజీగోండు, కొమరంభీం పోరాట స్ఫూర్తితో సామాజి కోద్యమాలను నిర్మించాల్సిన అవసరమని తెలిపారు. లెల్లెల బాల కృష్ణ మాట్లాడుతూ సామాజికోద్యమ నాయ కులైన ఫూలే, అంబేద్కర్ల స్ఫూర్తితో బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ఏప్రిల్ 11న ఫూలే, 9న రాంజీ గొండ్ వర్ధంతి, 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 30న హైదరాబాదులో పూలే అంబేడ్కర్ జన జాతరకు మేధావులు కవులు కళాకారులు సామాజిక ప్రజాసంఘాల నేతలందరిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ మాట్లాడుతూ బీజేపీ మనువాద విధానాలకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలతో మైనార్టీలు కలిసి ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.