Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కుమ్మక్కయ్యాయి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కొన్ని ఉపాధ్యాయ సంఘాలు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కుమ్మక్కై తెలుగు పేపర్‌ను లీక్ చేశారని రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పీయూసీ చైర్మెన్ ఏ జీవన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారంనాడిక్కడి తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ వేసే బొక్కలకు కొందరు ఆశపడుతున్నారనీ, అందుకే ప్రశ్నా పత్రాల లీకేజీలు జరుగుతున్నాయని చెప్పారు. విద్యార్థులను, తెలంగాణ సమాజాన్ని గందరగోళపర్చడమే లక్ష్యంగా బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నదని అన్నారు. బూర ప్రశాంత్‌తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు పేపర్ లీకేజీకి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు కొట్టారని బండి సంజరు అబద్దాలు చెప్పారన్నారు. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు జడ్జీలపై ఏం మాట్లాడారో అందరికి తెలుసన్నారు. బీజేపీ లీగల్ టీమ్ బండి సంజరు బెయిల్ కోసం బెదిరించే ప్రయత్నం చేశారని అన్నారు. ఈటెల రాజేందర్ సూక్తులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రయివేటు యూనివర్సిటీలకు వ్యతిరేకమని చెప్తున్న బండి సంజరు తన కుమారుడిని మహేంద్ర యూనివర్సిటీలో ఎలా చదివిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ వందే భారత్ రైళ్లోను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. వందే భారత్ స్కీం 2009 లో వచ్చిందన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే నాలుగు బొగ్గు బ్లాకులను అమ్ముతున్నారనీ, ఇది తెలంగాణకు బీజేపీ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని ఎద్దేవా చేశారు.