Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నర్సింగ్ వృత్తిలో విశేష సేవలు అందించినందుకు నీలోఫర్ ఆస్పత్రిలో గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పకు 'నర్సింగ్ అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' అవార్డు లభించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ హెడ్‌క్వార్టర్స్‌లో 'సమర్పణ్ దివస్' నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని నర్సింగ్ వత్తిలో విశిష్ట సేవలు అందిస్తున్న పది మంది నర్సింగ్ ఆఫీసర్స్‌ను ఈ అవార్డ్‌తో సత్కరించారు. దానిలో తెలంగాణ రాష్ట్రం నుంచి పుష్ప ఎంపికయ్యారు. కేంద్రమంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభారు ఈ అవార్డును ఆమెకు అందచేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శారద్ కేఆర్ అగర్వాల్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప మాట్లాడుతూ అవార్డుకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది నర్సింగ్ సమాజానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. 38 ఏండ్లుగా సర్వీసులో ఎంతో మంది రోగులకు సేవలు అందించినట్టు తెలిపారు.