Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నిర్ణీత వేళల్లో మాత్రమే తెరుచుకునే షాపులు, దుకాణ సముదాయాలు ఇక నుంచి 24 గంటలపాటూ తెరుచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా రాష్ట్రమంతటా వ్యాపారులు, చిరు వ్యాపారులు తమ షాపులను 24 గంటల్లో ఎప్పుడైనా తెరుచుకునేందుకు వీలు కల్పించారు.