Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుంకేట అన్వేష్‌రెడ్డి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట అన్వేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లోని ధాన్యం కల్లాల్లో ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రూ. 1700 వందలకే రైతులు ధాన్యాన్ని అమ్ముకునే దుస్థితి వచ్చిందని తెలిపారు. రైతులకు తూకం పట్టి కొనుగోలు కేంద్రాల్లోనే ఇవ్వాలని కోరారు.