Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టు అంతా నాటకమేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ, బీఆర్ఎస్ ఆడుకుంటున్నాయని విమర్శించారు. పేపర్ లీక్ కాదు... మాస్ కాపీయింగ్ అంటూ పోలీసు కమిషనర్ తేల్చి చెప్పారని గుర్తు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మెట్టు సాయికుమార్, చరణ్ కౌశిక్‌లతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బండి సంజయ్ అరెస్టును బీఆర్ఎస్ పక్కా ప్లాన్ ప్రకారం చేసిందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు అమిత్‌షా, కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.