Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఎంఎంటీఎస్ పనులు పెండింగ్లో పడుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని నవ్వులపాలు చేస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని పక్కనపెట్టి...బంగారు కుటుంబాన్ని నిర్మించుకున్నారని ఆరోపించారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తొమ్మిదేండ్లలో ఒక్క రోజు కూడా ప్రధాని మోడీ సెలవు తీసుకోలేదన్నారు. కేసీఆర్ మాత్రం తొమ్మిదేండ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీని అణచేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పదోతరగతి ప్రశ్న పత్రాల లీకేజీని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.