Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ బాలమల్లేష్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం గా అమలు చేయాలని, పేదలకు ఇండ్లస్థలాలు కేటాయించాలని కోరు తూ ఈనెల 10న జిల్లా కలెక్టర్ కార్యా లయాల ముందు ధర్నాలు నిర్వహించ నున్నట్టు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ బాల మల్లేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటి స్థలాలు ఉండి నిర్మాణం చేపట్టేందుకు రూ.ఆరు లక్షల సహ కారం అందించాలని కోరారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు పరచడం లేదని విమర్శించారు. ఒకవైపు నిధు లు తగ్గిస్తూనే మరోపక్క ఉపాధి కూలీ లు రెండుసార్లు ఫొటో అప్లోడ్ చే యాలనే నిబంధనలు పెట్టి దీన్ని నిర్వీ ర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
దళిత బంధు పథకం అర్హులైన వారికి అం దించకుండా ఎమ్మెల్యేల సిఫారసు చేసిన వారికి అందించడం తో దాని ఉద్దేశం మారిపోతున్నదని పేర్కొన్నారు. ఆసరా పెన్షన్లు సక్రమం గా అందించడం లేదని తెలిపారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేయాలని, పోడు సాగు దార్లకు పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.