Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీల పున:నియామకానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీలో కీలకమైన ఐదు అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడుగా పొగాకు జైరామ్ చందర్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుగా శ్రీపతి సతీష్, దళిత విభాగం(ఎస్సి సెల్) రాష్ట్ర అధ్యక్షుడిగా పొలంపల్లి అశోక్, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టిఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడుగా పార్లపల్లి రవీందర్, టీఎన్టీయూసీ (కార్మిక విభాగం) రాష్ట్ర అధ్యక్షుడుగా ఎం కే బోస్ నియమితులయ్యారు. తెలంగాణ టీడీపీ పాత కమిటిలోనూ వీరు ఈ పదవులనే చేపట్టారు. అయితే కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా చేపట్టిన నూతన కమిటీల నియామకాల్లో నలుగురు నేతలకు మరోసారి సారధ్య బాధ్యతలను అప్పగించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి నూతనంగా నియమితులైన పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు కృషి చేయాలని కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. పార్టీ అధినాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ అనుబంధ విభాగాల శ్రేణులను ముందుకు నడిపించి టీడీపీని బలోపేతం చేయాలని ఆదేశించారు.