Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న 14 జాతీయ రహదారుల సంగతి ఏంటని ప్రశ్నించారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. యువతలో మతతత్వ బీజాలు నాటేందుకు బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడున్న బీజేపీ వాజ్‌పేయి, అద్వానీల కాలంనాటిది కాదనీ, ఈ బీజేపీ కుట్రలు, కుతంత్రాలతో నిండిపోయిందని విమర్శించారు. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేశారు.
బోయినపల్లితో గెల్లు భేటీ
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మెన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ గెల్లు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలో టూరిజం అభివద్ధికి కషి చేయాలని సూచించారు.