Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూరల్లో తమ్మినేని విస్తృత పర్యటన
- పలువురికి పరామర్శ
నవతెలంగాణ - ఖమ్మంరూరల్
పేదలకు ఎర్రజెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో తమ్మినేని వీరభద్రం శుక్రవారం విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తొమ్మిందేండ్లలో దళితులు, గిరిజనులు అట్టడుగు వర్గాలపై దాడులు, లైంగికదాడులు, హత్యలు పెరిగాయని విమర్శించారు. మనువాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుందన్నారు. కులాలు, మతాల మధ్యన చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా లౌకిక శక్తులతో చేతులు కలుపుతామని స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పేపర్ లీకేజ్ ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల ఇన్చార్జి ఉరడీ సుదర్శన్ రెడ్డి, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.