Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు ఫెడరేషన్ వినతి
- సానుకూల స్పందన
నవతెలంగాణ - హైదరాబాద్
మాస్టర్ హెల్త్చెకప్ పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, పి.ఆనందం, పి.రాధిక, వై. ప్రభాకర్, కార్యదర్శి బి.జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులు పి.నాగవాణి, హెచ్‌యూజే అధ్యక్షులు బి.అరుణ్‌కుమార్ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా కంటి వెలుగు, మాస్టర్ హెల్త్ చెకప్ తదితర పథకాల పట్ల చర్చ చోటుచేసుకుంది. మహిళా జర్నలిస్టుల కోసం చేపట్టిన మాస్టర్ హెల్త్ చెకప్ పథకంతో మంచి ఫలితాలు వచ్చాయని ఫెడరేషన్ బృందం మంత్రికి తెలియజేసింది. ఈనేపథ్యంలో ఆపథకాన్ని మొత్తం జర్నలిస్టులతోపాటు వారి కుటుంబ సభ్యులకూ అమలుచేయాలని కోరింది. ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన హెల్త్‌కార్డులు సక్రమంగా పనిచేయడం లేదని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. హెల్త్ కార్డులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫెడరేషన్ విజ్ఞప్తికి స్పందించిన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని జర్న లిస్టులకు మాస్టర్ హెల్త్చెకప్ పథకం అమలుచేయడానికి అభ్యంతరం లేదన్నారు. జిల్లాల్లో కొంత ఇబ్బంది ఉంటుందనీ, టెస్ట్‌ల పరికరాలు జిల్లాలకు తరలించడం కొంచెం కష్టమవుతుందన్నారు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని అమలుచేస్తామని హామీ ఇచ్చారు.