Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాశరథి ధియేటర్, ఎస్వీకే ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాల ప్రదానం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సమాజ హితాన్ని కోరేలా ఉండాలని లఘుచిత్రాల నిర్మాణం ఉండాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ అన్నారు. మూఢనమ్మకాలు, మాయలు, మంత్రాలు, ఖర్మ వంటి విశ్వాసాలను పెంపొందించేలా ఉండరాదని అభిప్రాయపడ్డారు. దాశరథి ధియేటర్, సుందరయ్య విజ్ఞానకేంద్రం సంయుక్తాధ్వర్యంలో 50 లఘు చిత్రాల ప్రదర్శన చిత్రబృందానికి ప్రశంసాపత్రాల ప్రదానోత్సవ కార్యక్రమం దాశరథి ధియేటర్ కన్వీనర్ బీడీఎల్ సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వినయకుమార్ మాట్లాడారు. కథనంలో బలం ఉండే లఘుచిత్రాలు కూడా వెండితెర అనుభూతిని ఇస్తాయన్నారు. ఆత్మహత్యకో, హత్యకో దారితీసేది ప్రేమే కాదని తెలియచెప్తూ, నేటి యువతరంలో సరికొత్త ఆలోచనలు రేకెత్తించేలా నిర్మితమైన లఘుచిత్రాలు మంచి అనుభూతిని మిగులుస్తున్నాయని చెప్పారు. సృజనకు పదుపుపెట్టే రీతిలో నిర్మితమయ్యే లఘుచిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. దాశరథి ధియేటర్ కో కన్వీనర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ త్వరలో ఏఎస్ రావు జీవిత చరిత్రతో సినిమాను నిర్మించనున్నట్టు చెప్పారు. అలాగే లఘుచిత్రాల ప్రదర్శన కోసం ప్రత్యేకంగ యూట్యూబ్ ఛానల్ను కూడా ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లఘుచిత్రాల నటులు, దర్శకులు, నిర్మాతలకు ప్రశంసా పత్రాలు అందచేశారు. కార్యక్ర మంలో నటులు ఈఆర్ ధనుంజరు గుప్తా, పీ జగదీశ్, యూహెచ్ రఘురామచంద్ర, రాజనాల సత్య, రఘు, లక్ష్మీ, సోషల్ మీడియా కన్వీనర్ బండారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.