Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేరకు సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ సవరించాలి
- కేంద్ర హోంమంత్రికి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయాన్ని కేంద్రం సమీక్షించాలని రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. తాజాగా విడుదల చేసిన సీఆర్పీఎఫ్్ జాతీయ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో మాత్రమే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆ లేఖలో సూచించారు. సీఆర్పీఎఫ్˜్ ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న పరీక్షను, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిటీ టెస్ట్ విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ నిర్ణయం సంపూర్ణంగా అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సీఆర్పీఎఫ్్ సిబ్బంది నియామకం కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లో హిందీ, ఇంగ్లీష్ మాద్యమాల్లోనే పరీక్ష అంటూ విధించిన పరిమితులను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి లేఖ ద్వారా కేటీఆర్ తీసుకుపోయారు. అనేక అధికారిక భాషలు కలిగిన భారత దేశంలో, కేవలం హిందీ వారికి మాత్రమే మాతృభాషలో పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడం దేశ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని సీఆర్పీఎప్ నోటిఫికేషన్ కాలరాస్తుందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటిని గుర్తించబడిన అన్ని అధికారిక ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తమ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి 2020 నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది మంది యువకులకు ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్‌కు సవరణ చేయాలని అమిత్ షాకు కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.