Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేం దుకు వచ్చిన ప్రధాని మోడీ రాజకీయాలు మాట్లాడా రని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శిం చారు. శనివారం హైదరాబాద్ బీఆర్ఎస్ఎల్పీ కార్యా లయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేభారత్ రైళ్లను మోడీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఆదానీ అవినీతి సంగతేంటని నిలదీశారు.
రాష్ట్రం అభివద్ధి కాకుంటే కేంద్రం అవార్డులెందుకిచ్చిందో చెప్పాలని సవాల్ చేశారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే సీఎం స్వాగతం తెలపాలని ఏ చట్టంలో ఉందని ప్రశ్నిం చారు. బీజేపీ సీఎంల అవినీతిపై విచారణ జరప రెందుకని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి కాదు.. కనీసం సికింద్రాబాద్ కు ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మోడీ రేషన్‌కార్డుల సంఖ్యను పెంచలేదని విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాల గురించి ఎందుకు మాట్లా డరని ప్రశ్నించారు. వ్యవసాయం, ప్రజా పంపిణీ వ్యవస్థలపై మాట్లాడే నైతిక అర్హత మోడీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు మోడీ చేసిందేమి లేదని విమర్శించారు.
అబద్ధాల మోడీ:డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో అబద్ధాలా డారని రైతు బంధు సమితి చైర్మెన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. పీఎం ప్రసంగంలో కొత్తదనమేమీ లేదన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే, అది తామే కేటాయించినట్టు ప్రచారం చేసుకున్నారని తప్పు పట్టారు. హైదరాబాద్ మెట్రోలో కేంద్రం ప్రమేయం లేకున్నా గొప్పలకు పోయాడని ఎద్దేవా చేశారు. జాతీయ రహదారులకు తొమ్మిదేండ్లలో కేంద్రం రూ.20 వేల కోట్లు కేటాయిస్తే ప్రజలు ఇప్పటికే టోల్ రూపంలో రూ.9 వేల కోట్లు కట్టారని తెలిపారు. తొమ్మిదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కేటాయించలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ బీజేపీ దొడ్డిదారిన తెలంగాణను కబలించడానికి చేస్తున్న ప్రయత్నాలకు మోడీ సహకరించినట్టుగా ఉందని విమర్శించారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అంటే భారతీయ జనతా సర్కస్ పార్టీ అనీ, అభివృద్ధి ముసుగులో ఎన్నికల డ్రామాలాడారని విమర్శించారు. పేరెడ్ గ్రౌండ్లో మోడీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. అసలు ప్రధాన మంత్రి వచ్చింది దేనికి? కొత్త పథకాల శంకుస్థాపనకా? పాతగోడలకు సున్నాలు వేయడానికా? అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ది కుటుంబ పాలన కాదు ఉద్యమ పాలన అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఉద్యమ సూర్యుడయితే కేటీఆర్, హరీష్ రావు, కవిత ,సంతోష్ రావులు నాలుగు దిక్కుల్లో పోరాడిన వీరులని కొనియాడారు. అవినీతిలో అగ్రస్థానాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలవేనని విమర్శించారు.